పవన్ ప్రశంస..


రాజమౌళి కృషి పట్టుదలతో తెలుగువారంతా గర్వపడేలా బాహుబలిని చిత్రీకరించారని .. ఒక తెలుగు సినిమా 100 కోట్లు వసూలు చేయడమే గగనమైన ఈ పరిస్థితుల్లో వెయ్యి కోట్లు బాహుబలి2 కలెక్ట్ చేసి తెలుగు వారి సత్తాను ప్రపంచానికి తెలిపిన రాజమౌళికి హ్యాట్సాఫ్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. రాజమౌళి ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

పవన్ ఈ మేరకు రాజమౌళి, బాహుబలి సినిమాపై పొగడ్తల వర్సం కురిపించారు. ఐదేళ్ల పాటు ఎంతో దీక్ష తో చేసిన కళాఖండం బాహుబలి అని పవన్ కీర్తించారు. బాహుబలి2 వెయ్యి కోట్లు ప్రకటించిందని బాహుబలి టీం ప్రకటించిన తర్వాత పవన్ ఈ మేరకు అభినందలు తెలిపారు.

To Top

Send this to a friend