పవన్ ను టైం చూసి కొట్టారు..


రాజకీయాల్లో నిజాయితీగా ముందుకెళ్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో పాపం పవన్ కళ్యాన్ కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఆర్థికంగా లేకపోయినా సినిమాలు చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించి జనం కోసమే ఖర్చుపెడుతున్న పవన్ ను అదును చూసి ప్రత్యర్థి వర్గాలు దెబ్బకొట్టాయి. పవన్ ను ఆర్థికంగా దెబ్బతీస్తే రాజకీయాల్లోకి వెనక్కి తగ్గుతాడనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ వేశాయి.. గతంలో కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ విషయంలో ఫస్ట్ షో పడకుండానే మీడియా సహకారంతో ఉదయమే నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారు. తరువాత దాని ఫలితం ఎలా వచ్చిందో మనకు తెలిసిందే.. ఆర్థికంగా పవన్ ఆ సినిమాతో చాలా నష్టపోయాడు. దానిపై ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్లు పవన్ కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఇప్పుడు పవన్ కళ్యాన్ ఏపీలో టీడీపీ-బీజేపీకి ఉమ్మడి ప్రత్యర్థి. 2019 ఎన్నికల్లో ఏపీ బరిలోని నిలుస్తానని స్పష్టం చేశారు. అందుకే ఆయన్ను సహజంగానే టీడీపీ-బీజేపీ కూటమి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు అదే జరిగిందా.? తానే ప్రచారం చేసి గెలిపించిన పార్టీ లు చివరకు తన ఆర్థిక మూలలు దెబ్బతీస్తుంటే కసితో రగిలిపోతున్నాడు. వారిపై మరింత పోరుబాటకు ఈ ఉదంతాలు పవన్ కు ఊతంగా మారతాయనడంలో సందేహం లేదు.

ఈరోజు కాటమరాయుడు రిలీజ్.. పవన్ అభిమానులకు పండుగ రోజు. కాటమరాయుడు సినిమా కోసం జనం, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రిమియర్ రిలీజ్ లు, ఫస్ట్ షోల కోసం చాలా మంది జనం టికెట్ల కోసం ఎగబడి కొనుగోలుచేశారు. డిమాండ్ దృష్టా ఒక్కో టికెట్ ను 3వేల నుంచి 5 వేల వరకు టికిట్ వరకు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు ముందే 115 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది తెలుగు సినిమాల్లోనే ఓ రికార్డ్. అందుకే పవన్ ను ఇంతలా లాభపడకుండా చేయడానికి ప్రత్యర్థి పార్టీలు ఏకమయ్యాయని తెలిసింది. తమకు ఏపీలో కంట్లో నలుసులా మారిన పవన్ ను అదునుచూసి దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

హైదరాబాద్ లో కొందరు విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో జట్టు కట్టి తమ పిల్లలు కాటమరాయుడు సినిమా కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని ఆందోళనను రేకెత్తించారు. దీనికి బీజేపీ నాయకుల సపోర్టు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి పోలీసుల దృష్టికి తీసుకెల్లారు. దీంతో నిన్న రాత్రి, ఈరోజు ఉదయం ప్రదర్శించాల్సిన ప్రిమియర్ షోలు రద్దయ్యేలా చేశారు.

ఏపీలో కూడా టీడీపీ నేతల ప్రోద్బలంతో కర్నూలు, చిత్తూరు తదితర చోట్ల కాటమరాయుడు ప్రిమియర్ షోలు రద్దు చేశారు. అల్లర్లు, ఉద్రిక్తత, అంటూ పోలీసులను పురమాయించి షోలను ఆపివేయించారు. దీనివల్ల ఆ డబ్బులు సినిమా యూనిట్ తిరిగివ్వాల్సిన పరిస్థితి. అంతిమంగా ఇది పవన్, నిర్మాతలకు నష్టం చేకూర్చేలా మారింది. టీడీపీ-బీజేపీలు కలిసి ఆడిన ఈ నాటకంలో పవన్ సమిధిగా మరాడు. ఈ కసితోనైనా వచ్చే ఎన్నికల్లో వారిపై యుద్ధం ప్రకటిస్తాడేమో చూడాలి.

To Top

Send this to a friend