పవన్ మాటలు: కోటా కన్నీళ్లు


దిగ్గజ టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాస్ రావు ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు తెలిపాడు.. పవన్ కళ్యాణ్ మాటలతో తనకు స్టేజ్ మీద కన్నీళ్లు వచ్చాయని వివరించారు. పవన్ లాంటి గొప్ప నటుడు అన్న మాటలు ఇప్పటికీ తనకు గుర్తుకువస్తాయని తెలిపారు..

అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. యూనిట్ మొత్తం వేదికకు హాజరయ్యారు. భారీ ఏర్పాట్లు చేశారు. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టులందరి గురించి మాట్లాడి కోటా గురించి కూడా మాట్లాడారు.. పవన్ మాట్లాడుతూ ‘కోటగారు పెద్దవారు.. ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసుకానీ, అనుభవం కానీ సరిపోదు’ అన్నారు. దీంతో కోటా గారు.. వేదికమీద కళ్లలోనే నీళ్లు తెచ్చుకున్నారు.. తెలుగులో అంతటి క్రేజ్ ఉన్న నటుడు నా గురించి రెండు మాటలు చెప్పడాన్ని ఇప్పటికీ గౌరవంగా భావిస్తున్నాను అని కోటా శ్రీనివాసరావు ఇంటర్వ్యూలో వివరించారు.

To Top

Send this to a friend