పవన్ లో ఇంతపెద్ద మార్పా..?


మరక మంచిదే.. మార్పు మంచిదే.. ఏదైనా మనలో జ్ఞానోదయాన్ని తట్టిలేపుతుంది. పవన్ ఆది నుంచి తన సినిమాల్లో వైవిధ్యాన్నే చూపించారు. ఇప్పటికీ చూపిస్తున్నారు. మీరా మిరా మీసం అంటూ మెలితిప్పే మీసాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. పాత్రలను బట్టి పవన్ ఎప్పుడూ మరిపోలేదు. కానీ తన లుక్ తోనే పాత్రలకు జీవం పోసి హిట్ లు కొట్టాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఖుషీ సినిమా వరకు వరుస హిట్ లతో దూసుకుపోయాడు. తన బాడీ లాంగ్వేజ్ లో.. శరీర సౌష్టవంలో ఎన్నడూ పవన్ మార్పులు చేయలేదు. కానీ ఇప్పుడు చేశాడు..

ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్లు సారథి స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంగా పలు సీన్లు లీక్ అయ్యాయి. ఇందులో పవన్ స్టిల్స్ చూసి అభిమానులు అశ్చర్యానికి లోనవుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడులో కొంచెం బొద్దుగా ఉన్న పవన్ ఈ సినిమాలో స్లిమ్ గా .. అచ్చం సాఫ్ట్ వేర్ కుర్రాడిగా కనిపిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇంత వరకు తన బాడీలో మార్పులు చేయని పవన్ ఇప్పుడు కొత్తగా పాత్ర కోసం ఇలా మారడంతో విశేషంగా చెప్పవచ్చు..

త్రివిక్రమ్ సినిమాలో స్లిమ్ సాఫ్ట్ వేర్ బాయ్ గా పవన్ లుక్ అదిరిపోయేలా ఉంటుందని చిత్రవర్గాలు తెలిపాయి. హారికహాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు తమిళ యంగ్ డైనెమిక్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. స్వయంగా సాఫ్ట్ వేర్ నేపథ్యం నుంచి వచ్చిన అనిరుధ్ తోనే ఈ సినిమాకు సంగీతం చేయిస్తుండడంతో పాటలన్నీ ఓ రేంజ్ లో వస్తున్నాయని తెలిసింది. దానికి తగ్గట్టే వపన్ హావభావాలు, వేషధారణ ఉందట.. సినిమా వచ్చే వరకు పవన్ అభిమానులు వేచిచూడాల్సిందే మరి..

To Top

Send this to a friend