కాంగ్రెస్ తో పవన్.. జగన్ కు లైన్ క్లియర్

ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన సపోర్టు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే తన ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏపీ ప్రత్యేక హోదా కోసం నిరసన సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రత్యేక హోదా బహిరంగ సభలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పవన్ ను ఆహ్వానించారు. కానీ సమయం లేకపోవడంతో తాను ఈ సభకు హాజరు కాలేకపోతున్నానని.. పవన్ ట్వీట్ చేశాడు. కానీ ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ ఆందోళన చేసినా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు సభ తన లక్ష్యాన్ని సాధించగలదని ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జనసేనాని ఈ ప్రకటనతో ఒక్కటి స్పష్టం చేశారు. ఎవరైతే ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతారో వారితో కలిసి ఉద్యమించడానికి పోటీచేయడానికి అభ్యంతరం లేదని ఈ నిర్నయంతో తేల్చిచెప్పినట్టైంది. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్ కు పవన్ నిర్ణయం ఊరట నిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే హోదా కోసం జగన్ ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. దీంతో వచ్చే 2019 ఎన్నికల్లో హోదాకోసం పోరాడే వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కలిసి పోటీ చేసేందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend