పవన్ ఫ్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నాడు..

ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ పక్కనే పొడుగ్గా ఓ వ్యక్తి మీడియా కంటపడ్డాడు. అతడు పవన్ ను మించి హైట్ ఉన్నాడు. ఎవరా అని జూమ్ చేసి చూస్తే పవన్ కొడుకు అకీరానందన్. కొడుకుతో కలిసి వస్తున్నా పవన్ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి అకీరా హీరోగా ఎంట్రీ చేస్తారా అని అడగ్గా.. ‘షూర్ వై నాట్.. వాడు హీరో అవుదామని వచ్చాడు’ అని సమాధానమిచ్చాడట..

అలా మరో స్టార్ హీరో పవన్ కుమారుడు తెరగేంట్రం కూడా జరగబోతోంది. అన్నట్టు తెలుగులో ఉన్న పొడగరి హీరోలు ప్రభాస్, రానా, వరుణ్ సందేశ్ ల పక్కన మరో పొడగరి మీరో అకీరానందన్ అని చెబుతున్నారు.. మొత్తానికి పవన్ తన కొడుకు కోసం బాగానే ఫ్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నాడన్నమాట.. ఇక స్టార్ హీరోల కుమారులు హీరో కావడం అనేది సర్వసాధారణమే.. ఈ కోవలోనే హీరో బాలక్రిష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే చాలా ఊహాగానాలు వస్తున్నా ఆయన కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడం లేదు..

ప్రస్తుతం పవన్ కళ్యాన్ పిల్లలు ఇద్దరు పుణెలో వాళ్ల అమ్మ రేణుదేశాయ్ తో కలిసి ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు మన మీడియాకు, ప్రజలకు దూరంగా బతికేస్తున్నారు.. అయితే పుణెలో ఉంటున్న అకీర నందన్ ను హీరోను చేయాలని వాళ్ల అమ్మ రేణుదేశాయ్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. అందులో భాగంగానే ఈ మధ్య పవన్ పుణె వెళ్లి కొడుకు అకీరానందన్ వెంటేసుకొని వచ్చి హైదరాబాద్ లో జరుగుతున్న తన షూటింగ్ స్పాట్ లకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చే పనిలో పడ్డాడట..హీరోగా నిలబెట్టడానికి సానపెడుతున్నాడట.. అదీ సంగతీ..

To Top

Send this to a friend