గ్యాప్ లో కొడుతున్నాడు.. భారీ మొత్తానికి..

దసరా నుంచి స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జనసేన లో చేరే నాయకుల కోసం రిక్రూట్ మెంట్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దసరా తర్వాత ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరించిందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాతోనే తాత్కాలికంగా సినిమాలను ఆపేద్దామని అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సినిమా పూర్తి కావడం.. రెండు నెలల సమయం ఉండడంతో పవన్ మరో సినిమాను అంగీకరించారు.

రెండు నెలల కాల్షీట్లు ఇస్తే 40 కోట్ల పారితోషికం ఇస్తామని.. తమ తో ఓ సినిమా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనుంచి పవన్ కు ఆఫర్ వచ్చింది. ఈ కథ విన్న పవన్ చేసేందుకు ఓకే చెప్పాడు. దసరాకు ముందు ఈ సినిమాను కంప్లీట్ చేసి ఈ మొత్తాన్ని ఎన్నికల్లో ఖర్చు కోసం వెచ్చించనున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. షూటింగ్ ను త్రివిక్రమ్ శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. ఆ సినిమా ఈనెలలోనే కంప్లీట్ అవుతుందట.. దసరాకు విడుదల కానుంది. దసరాకు రెండు నెలల గ్యాప్ ఉండడంతో పవన్ మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

To Top

Send this to a friend