మళ్లీ బాబు వద్దకే.. పవన్ తప్పటడుగు..

రాజకీయంగా ఎదగాలనుకునే వారు సాధారణంగా ఏం చేస్తారు.? అధికారంలో ఉన్నవారితో కొట్లాడుతారు.. జగన్ అదే చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడు పీకేను పెట్టుకొని మరీ పథకాలు, ప్లాన్ లు చేస్తున్నాడు. నిజమైన రాజకీయ నాయకుడు అలానే చేస్తాడు. కానీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటే సపరేట్.. ఆయన సమస్యల పరిష్కారం పేర మళ్లీ చంద్రబాబు పంచనే చేరడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది..

పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను గుర్తించడం అమెరాకా హార్వర్డ్ వైద్యులను రప్పించడం దీనికి పరిష్కారం కోసం చంద్రబాబును కలవడం జరిగిపోయింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మంచిదే కానీ.. ఈ సమస్యలపై పవన్ ఎవరి మీద అయితే పోరాడుతున్నాడో.. టార్గెట్ చేశాడో అదే చంద్రబాబును ఈ విషయంలో కలిసి ఉద్దానం సమస్యను పరిష్కరించాలని కోరడంతో ఈ క్రెడిట్ మొత్తం బాబు ఖాతాలోకే పోతోంది. సమస్యను పరిష్కరించిన క్రెడిట్ బాబుదే అంటున్నారు. పవన్ కొరియర్ పాత్ర పోషించినట్టే కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలతో కలిసి పోరాడాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. కానీ అటు తిరిగి ఇటు తిరిగి అంతకు ముందు తిట్టిన చంద్రబాబు పంచనే చేరుతుండడంతో అసలైన రాజకీయ నాయకత్వం పవన్ లో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పవన్ తప్పులను ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు.

To Top

Send this to a friend