పన్నీర్ మాస్టర్ ప్లాన్..?


జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రెండు వర్గాలు విడిపోయింది. ఒక వర్గానికి జయ నెచ్చలి శశికళ నాయకత్వం వహిస్తుండగా.. రెబల్ వర్గానికి పన్నీర్ సెల్వం నాయకత్వం వహించారు. ఈ ఇద్దరూ తమిళనాడు సీఎం పీఠం కోసం ఉత్కంఠబరితంగా పోరాడారు. చివరకు చిన్నమ్మ శశికళ కే పీఠం దక్కింది. ఆమె బలపరిచిన ఫళని స్వామి సీఎం అయ్యారు. అక్కడికట్ చేస్తే..

మోడీ ప్రోద్బలంతో అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ కు ఉప ఎన్నికవచ్చింది. శశికళ పుత్రుడు దినకరణ్ అక్కడి నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీచేశారు. దాదాపు 90 కోట్లు పంచాడు. ఈ విషయం తెలిసి మోడీ ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికనే రద్దు చేశాడు. డబ్బులు పంచిన వాళ్లపై కేసులు పెట్టాడు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే గుర్తు కోసం పన్నీర్, శశికళ వర్గం పోటీపడ్డాయి. ఈసీ ఎవ్వరికీ ఈ గుర్తు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లింది. అయితే అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ కోసం శశికళ కొడుకు దినకరన్ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సభ్యుడికి దాదాపు రూ.50కోట్ల లంచం ఇవ్వజూపాడు. దీన్ని పసిగట్టిన సీబీఐ దినకరన్ పై కేసు పెట్టింది. ఈ వ్యవహారంతో శశికళ-దినకరణ్ ప్రతిష్ట మసకబారింది. దీంతో పన్నీర్ సెల్వం వేగంగా పావులు కదిపారు.

అవినీతి, అధికార దాహంతో పార్టీ పరువు తీస్తున్న శశికళ-దినకరన్ పీడ వదిలించుకోవడానికి తమిళనాడు సీఎం ఫళని స్వామి-రెబల్ నేత పన్నీర్ సెల్వం రంగంలోకి దిగారు. వీరిద్దరు కలిసి నడిస్తే పార్టీ గుర్తు తమకే ఇస్తారని.. దాంతో పాటు శశికళ-దినకరణ్ పీడ విరగడవుతుందని పన్నీర్ .. ఫళని స్వామి ముందు రాజీ ప్రయత్నాలు చేశారు. నిన్నరాత్రి చైన్నైలో ఈ మేరకు పన్నీర్ తరఫున మాజీ మంత్రి పాండ్యరాజన్, కేపీ మునుస్వామి, జేసీడీ ప్రభాకర్.. అధికార సీఎం ఫళినస్వామి తరఫున సీనియర్ మంత్రి జయకుమార్ తదితరులు సయోధకోసం చర్చలు జరిపారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి దొరికిపోయేనప్పటినుంచే ఈ చర్చలు మొదలైనట్టు సమాచారం.

ఆర్కేనగర్ ఎన్నికల్లో డబ్బులు పంచిన అన్నాడీఎంకే మంత్రులపై కేసులు నమోదయ్యాయి. మోడీ, ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే పార్టీపై కక్ష కట్టి రాజకీయాలు నడుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఫన్నీర్ సెల్వంతో సంధి చేసుకోవాలని ప్రస్తుత తమిళనాడు సీఎం ఫళని స్వామి భావించారు. అందుకే చర్చలు జరుపుతున్నారు. సీఎంగా ఫళని స్వామి కొనసాగుతారని.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం పన్నీర్ సెల్వంకు అప్పగించాలని ఈ చర్చల్లో ప్రధానాంశంగా ఉంది. శశికళ-దినకరణ్ ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించి పన్నీర్-ఫళని పార్టీని ప్రభుత్వాన్ని నడపాలని ప్లాన్ చేశారు. దీంతో శశికళ పని ఖతమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

To Top

Send this to a friend