సౌరబ్ గంగూలీ పై పాకి్ అభిమానుల దాడి..

Image result for pak attack gangoli car in england image
పాకిస్తాన్ అభిమానులు మరోసారి ఇండియాపై వ్యతిరేకతను లండన్ సాక్షిగా చాటుకున్నారు.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిశాక హోటల్ కువెళుతున్న గంగూలీని పాక్ అభిమానులు అడ్డుకున్నారు. కారుకు అడ్డం పడి పాకిస్తాన్ జాతీయ జెండాను గంగూలీ కారుపై వేశారు. ఇండియా ముర్దాబాద్, పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు..కారులో స్టీరింగ్ పట్టుకొని ఉన్న గంగూలీ దీనికి సీరియస్ కాకుండా నవ్వూతూ పక్కకు జరగండంటూ పాక్ అభిమానులను కోరాడు.

పాకిస్తాన్ అభిమానుల ఆగడాలు శృతిమించిపోవడంతో పోలీసులు వచ్చి పాక్ అభిమానులను చెదరగొట్టారు. గంగూలీని అక్కడినుంచి పంపించి వేశారు.ఇలా ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కు ఒక రోజుముందే పాక్ అభిమానులు ఇండియాపై వ్యతిరేకతను చాటుకున్నారు. భారత మాజీ కెప్టెన్ ను అవమానించారు.

చాంపియన్స్ ట్రోఫీ తొలిమ్యాచ్ లోనే పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత్.. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కానీ ఇండియా చేతిలో తొలి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన కసితో ఉన్న పాకిస్తాన్, భారత్ తో ఫైనల్ పోరుకు రెడీ అవుతోంది. ఆ వేడి ఇప్పుడు ఇంగ్లండ్ దేశంతో పాటు భారత్, పాక్ దేశాల్లో కూడా ఊపేస్తోంది. ఈ వేడిలోనే భారత మాజీ కెప్టెన్ గంగూలీ పై పాక్ దేశ అభిమానులు దాడికి పాల్పడ్డారు.

To Top

Send this to a friend