అయ్యో.. మీడియా పొరపాటు

బుల్లి తెరపై తనదైన శైలిలో టైమ్‌ సెన్స్‌, సెన్సాప్‌ హ్యూమర్‌తో ఆకట్టుకుంటూ వెళ్తున్న యాంకర్‌ ప్రదీప్‌ ప్రస్తుతం టాప్‌ యాంకర్‌గా దూసుకు పోతున్నాడు. ప్రదీప్‌ గురించిన ప్రతి విషయం కూడా ప్రస్తుతం ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చుతున్నారు. తాజాగా యాంకర్‌ ప్రదీప్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి, జైలుకు కూడా వెళ్లాడు అనే వార్తలు వచ్చాయి. దాంతో అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. మీడియాలో ప్రదీప్‌ అరెస్ట్‌ గురించిన వార్తలు తారా స్థాయిలో వచ్చాయి.

అరెస్ట్‌ అయిన ప్రదీప్‌ను జైలుకు తీసుకు వెళ్లారని, జడ్జీ ముందు కూడా హాజరు పర్చారు అంటూ పలు రకాల పుకార్లు  వచ్చాయి. చివరకు ప్రదీప్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ప్రదీప్‌ స్పందిస్తూ తాను అరెస్ట్‌ అయినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, తనపై ఎలాంటి చెక్‌ బౌన్స్‌ కేసులు కూడా నమోదు కాలేదు అని చెప్పుకొచ్చాడు.

బుల్లి తెర నటుడు మరో ప్రదీప్‌ ఉన్నాడు. ఇద్దరి పేర్లు ఒక్కటే అవ్వడంతో నటుడు ప్రదీప్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయితే యాంకర్‌ ప్రదీప్‌ అరెస్ట్‌ అయినట్లుగా మీడియా పొరపాటున వార్తలు ప్రచురించడం జరిగింది. నటుడు ప్రదీప్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో గతంలో కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే ఈసారి ప్రదీప్‌ పేరు మీడియా యాంకర్‌ ప్రదీప్‌గా ప్రచారం చేయడంతో గందరగోళం ఏర్పడ్డట్లుగా చెప్పుకోవచ్చు.

To Top

Send this to a friend