మీకు పొట్ట ఉంటే క్యాన్సర్ ముప్పు!!

ఊరికే పనిచేయకుండా కూర్చుంటే పొట్ట వస్తుంది. ఈ మధ్య పోలీసులకు ఆ బొజ్జ మరీ విపరీతంగా పెరిగిపోతోందట.. ఆ పొట్టను తగ్గించడానికి ఎంతో మంది ప్రాయసపడుతుంటారు. కానీ ఈ పొట్ట వల్ల కేన్సర్ ముప్పు పెరుగుతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ప్రేగు, రొమ్ము కేన్సర్లతో పాటు పాంక్రియాటిక్ కేన్సర్ పొట్టతో వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ నిపుణులు దాదాపు 43000 మంది పొట్టగల వారిపై పరిశోధనలు చేశారట.. 16000 మంది ఇందులో ఉబకాయ సంబంధిత క్యాన్సర్ బారిన పడ్డారట.. ప్రతి 11 సెంటీమీటర్ల నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ ఉబకాయ సంబంధిత క్యాన్సర్ల ముప్పు 13శాతం ఎక్కువవుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైందట..

ధుమపానం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నది క్యాన్సర్ తోనేనని.. పొట్ట, కొవ్వు వల్ల ఈస్ట్రోజిన్, టెస్టోస్టీరాన్ హార్మోన్లు లాంటి లైంగిక హార్మోన్లు ప్రభావితం కావడమే క్యాన్సర్ కు కారణమని పరిశోధకులు తేల్చారు.

To Top

Send this to a friend