న్యాయమా..అన్యాయమా.?


ఏ అభివృద్ధి ప్రాజెక్టు రూపం దాల్చాలన్న భూమి కావాలి. ఆ భూసేకరణ ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పి అవుతోంది. నిర్వాసితులతో కలిసి ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు.. అందుకే ఈ బాధలన్నీ పోవాలని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా భూసేకరణ చట్టం తెచ్చింది.. కేంద్రానికి పంపింది. కానీ కొన్ని సవరణలు చేస్తేనే చట్టాన్ని ఆమోదిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయించింది.

ఈ సమావేశాలను కేవలం 10 నిమిషాల్లోనే ముగించడం వివాదాస్పదమైంది. ఎలాంటి చర్చ లేకుండా లేకుండా కాంగ్రెస్ నిరసనల మధ్య 10 నిమిషాల్లోనే సభలో బిల్లును ఆమోదించారు. సీఎం కేసీఆర్ కూడా సభకు హాజరుకాకుండానే టీఆర్ఎస్ తమ బిల్లు ఆమోదాన్ని మొక్కుబడి తంతుగా ముగించింది. కాంగ్రెస్ వారు ప్రతిపాదించిన రైతులు సమస్యలు, ఇతర వాటిపై చర్చకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోలేదు. బిల్లుపై చర్చ లేకుండా స్పీకర్ ఆమోదించేశారు.

కాంగ్రెస్ హయాంలో ఈ భూసేకరణ వారికి కోట్లు కురిపించింది. సెజ్ ల పేరుతో తెలంగాణ భూములను కార్పొరేటర్లకు దోచిపెట్టారని.. వేల కోట్ల కమీషన్ తీసుకున్నారన్నది టీఆర్ఎస్ ఆరోపణ.. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నీటి గోస తీర్చడానికి కాళేశ్వరం, మల్లన్న సాగర్ లాంటి పథకాలను రూపొందిస్తోంది.. వాటిని కాంగ్రెస్ అడ్డుకుంటోంది. నిర్వాసితులు భూ పరిహారం పై నిర్వాసితుల పక్షాన పోరాడుతోంది. దీంతో భూసేకరణ టీ ప్రభుత్వానికి పెను విఘాతంగా మారింది. అందుకే చట్టం తేవడం.. కేంద్రం సవరణలతో అసెంబ్లీలో బిల్లును హడావుడిగా ఆమోదించారు. ఇందులో న్యాయ అన్యాయాలు పక్కనపెడితే ప్రభుత్వ ధ్యేయం మాత్రం నెరవేరింది. ప్రతిపక్షాల ఆరోపణలు, సమస్యలను పక్కన పెట్టేశారు. అభివృద్ధి కోసం అడుగు ముందుకు వేశారు. కానీ ప్రతిపక్షం కదా కాంగ్రెస్ అడ్డుకుంది. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

To Top

Send this to a friend