‘జై లవకుశ’ టీజర్‌ రివ్యూ


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మూడు పాత్రలకు మూడు టీజర్‌లను విడుదల చేయాలని నిర్ణయించుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటగా జై పాత్ర టీజర్‌ను విడుదల చేశారు.

జై పాత్ర నెగటివ్‌ ఛాయలు కలిగి ఉంటాయని టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు కనిపించని విధంగా విలనిజంతో ఎన్టీఆర్‌ దుమ్ము రేపాడు. ఎన్టీఆర్‌ నెగటివ్‌ రోల్‌లో తన నట విశ్వరూపాన్ని చూపుతాడని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుంది. రావణుడిని చంపాలంటే సముద్రాలు దాటాలి, ఈ జై రావణుడిని చంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలంటూ ఎన్టీఆర్‌ చెబుతున్న డైలాగ్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

ఈ టీజర్‌తో సినిమా స్థాయి 10 రెట్లు పెరిగి పోయింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు టీజర్‌లను కూడా చూసేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఆ టీజర్‌లను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. నివేదా థామస్‌ మరియు రాశిఖన్నాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

To Top

Send this to a friend