ఎన్టీఆర్ ‘జై లవ కుశ’


యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కథలు విన్న ఎన్టీఆర్ చివరకు దర్శకుడు బాబీకి అవకాశం ఇచ్చారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తుండడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూడింటో ఒకటి విలన్ పాత్ర అని కూడా ప్రచారం జరుగుతోంది. జూనియర్ తొలిసారి విలనిజం ఎలా ప్రదర్శిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ ను ఈ పో్స్టర్ లో బయటపెట్టకుండా కేవలం టైటిల్ లోగోను మాత్రమే రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా.. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

To Top

Send this to a friend