కొరటాలపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

ఎన్టీఆర్‌, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్‌’ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ‘జనతాగ్యారేజ్‌’ భారీ వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్‌తో మరో సినిమాను చేయబోతున్నట్లుగా కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. కొరటాల సన్నిహితుడు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఆ మద్య ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆ విషయం అధికారిక ప్రకటన వచ్చింది. అయితే తాజాగా ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి చరణ్‌తో మూవీకి దర్శకుడు కొరటాల శివ సిద్దం కావడం నందమూరి అభిమానులకు ఆగ్రహంను కలిగిస్తుంది.

ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా సినిమా చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన చర్చలు, ఒప్పందాలు పూర్తి అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కాని భరత్‌ అను నేను చిత్రం పూర్తి అయిన వెంటనే చరణ్‌ మూవీని చేసేందుకు కొరటాల శివ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చింది.

చరణ్‌ స్వయంగా నిర్మించబోతున్న ఆ సినిమాకు కొరటాల శివ భారీ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నాడు. చరణ్‌ రెమ్యూనరేషన్‌ ఎక్కువగా ఇస్తాను అని చెప్పడం వల్లే ఎన్టీఆర్‌ సినిమాను పక్కకు పెట్టినట్లుగా నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జై లవకుశ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా 2018 చివరి వరకు ఉంటుంది. దాంతో కొరటాల శివ ఆ గ్యాప్‌లోనే చరణ్‌తో మూవీ చేయనున్నాడని, ఎన్టీఆర్‌, కొరటాల కాంబో మూవీ 2019 ఆరంభంలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

To Top

Send this to a friend