దుమ్ము లేపేందుకు వచ్చేస్తున్నాడోచ్‌


ఎన్టీఆర్‌ ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం తర్వాత నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఒకటి లేదా రెండు పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్‌ మొదటి సారి మూడు పాత్రల్లో నటిస్తున్నాడనే వార్తలు రాగానే అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నాడు. తమ్ముడు ఎన్టీఆర్‌తో భారీ బడ్జెట్‌తో కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న సినిమా అవ్వడంతో ఫ్యాన్స్‌లోనే కాకుండా ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

ఇటీవలే ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా రెండు పోస్టర్‌లను విడుదల చేయడం జరిగింది. ఇక సినిమా టీజర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్‌ న్యూస్‌ చెబుతూ చిత్ర యూనిట్‌ సభ్యులు జులై మొదటి వారంలో చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో నెల రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మునుపెన్నడు కనిపించని విధంగా కొత్తగా కనిపించబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీలో మొదటి వంద కోట్ల చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుందనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటించారు. సెప్టెంబర్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదల తేదీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

To Top

Send this to a friend