సస్పెన్స్‌తో చావగొడుతున్నారుగా..!

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షో ప్రారంభ తేదీ దగ్గరకు వస్తుంది. ఈనెల 16 నుండి షోను ప్రారంభించబోతున్నట్లుగా స్టార్‌ మాటీవీ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రోమోలను వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోల్లో షోలో పాల్గొనబోతున్న స్టార్స్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విడుదలైన టీజర్‌ కూడా అదే తరహాలో సస్పెన్స్‌ను కొనసాగిస్తూ ఉంది.

షోలో పాల్గొనబోతున్న వారు ఎవరు అనే విషయాన్ని వెళ్లడి చేయవద్దని షో నిర్వాహకులు భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే తాజాగా విడుదలైన టీజర్‌లో కూడా ఫేస్‌లు కనిపించకుండా సస్పెన్స్‌ను మరింతగా పెంచారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ గొడ పక్కన నిల్చుని లోపల సెలబ్రెటీలు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడు. ఆ టీజర్‌తో షోపై ఆసక్తి మరింతగా పెరుగుతుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సెలబ్రెటీలు ఎవరా అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి, స్నేహ, రంభ, సదా, పోసాని కృష్ణమురళి, ధన్‌ రాజ్‌ మరియు మరో ఇద్దరు జబర్దస్త్‌ కమెడియన్స్‌ బిబ్‌ బాస్‌ షోలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తల్లో నిజం ఎంత అనేది మాత్రం తెలియడం లేదు. స్టార్‌ మా నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఒక క్లారిటీ రాదు.

To Top

Send this to a friend