కన్ఫర్మ్‌ : మరో ‘జనతాగ్యారేజ్‌’

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందుకుంది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక కొరటాల శివ త్వరలో మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాడు.

‘జనతాగ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల శివల కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశాలున్నాయంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. కాని తాజాగా ఎన్టీఆర్‌, కొరటాల కాంబోలో రెండవ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చింది. మహేష్‌బాబుతో సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌తో కొరటాల మూవీ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. పు చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన మిక్కిలినేని సుధాకర్‌ వీరి కాంబో సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. కొరటాల శివకు ఆప్తుడు అయిన సుధాకర్‌ యువసుధ అనే బ్యానర్‌లో ఈ సినిమాను త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేస్తున్న ‘జై లవకుశ’ పూర్తి అయిన తర్వాత కొరటాల శివ సినిమాను చేసే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

To Top

Send this to a friend