జియో ఫ్రీ ఆఫర్స్ ఇక ఉండవు..

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ జియో ఫీచర్ ఫోన్ దెబ్బ నుంచి కోలుకునేందుకు ఐడియా సెల్యులార్ తక్కువ ధరలో తన 4జీ హ్యాండ్ సెట్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ ఫోన్ ధర దాదాపు రూ.2500 వరకు ఉంటుందని ఐడియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. జియో హ్యాండ్ సెట్లలో కొన్ని యాప్స్ మాత్రమే పనిచేస్తాయని, నెటిజన్లకు కీలక అవరసరమైన వాట్సాప్ లాంటి కొన్ని ఫీచర్లు తమ హ్యాండ్ సెట్లలో అందుబాటులోకి రానున్నాయని ఐడియా ప్రకటించింది..

దేశ ప్రజలకు ఉచితంగా హైస్పీడ్ డేటా సేవలను జియో అందిస్తోంది. కానీ రోజురోజుకు ఉచిత ఆఫర్లతో నష్టాలు వస్తున్న దరిమిలా ఇక ఉచితాలపై పునరాలోచనలో పడిందట జియో యాజమాన్యం.. జియో దెబ్బకు పీకల్లోతూ నష్టాల్లో కూరుకపోయిన ఇతర టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు జియో బాటలోనే నడుస్తున్నాయి. తాము కూడా 4జీ శ్రేణులో ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దేశీయ మొబైల్ ఆపరేటర్లతో తక్కువ ధరకు 4జీ ఫోన్ ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయట.. జియోను తట్టుకోవాలంటే సొంత ఫోన్ల ఆవిష్కరణ తప్పదని భావించి టెలికాం ఆపరేటర్ ఐడియా కూడా రంగంలోకి దిగింది.. జియో దెబ్బకు కుదేలయిన ఎయిర్ టెల్, వోడాఫోన్ లు కూడా తక్కువ ధరకు ఫోన్ లు లాంచ్ చేసే పనిలో పడ్డాయి. మిగతా కంపెనీలు కూడా ఫ్రీ ఆఫర్లు ఇవ్వడంతో జియో ఈ ఆఫర్లను ఇక చాలించాలని భావిస్తోందట..

ఓ వైపు నష్టాలు, మరోవైపు ఉచిత ఆఫర్లతో పునరాలోచనలో పడ్డ జియో ఇక రాబోయే రోజుల్లో ఈ ఉచిత ఆఫర్లకు మంగళం పాడబోతున్నట్టు ప్రకటించింది. భవిష్యత్ లో ఉచిత సేవలను ఇవ్వబోమని ప్రకటించింది. ఇది వరకు ప్రకటించిన ఆఫర్లు కొనసాగుతాయని.. భవిష్యత్ లో ఉచితంగా అందించే పరిస్థితులు లేవని జియో స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో పెట్టుబడి, లాభాలు, ఆదాయం పైనే దృష్టి పెట్టినట్టు తెలిపింది. ఇలా ఫ్రీ ఆఫర్లు ఎల్లకాలం కొనసాగించడం కంపెనీకి భారంగా మారిందని జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend