ఇదో రొటీన్‌ యారీ.. ఆకట్టుకోని రానా

బుల్లి తెరపై రానా ‘నెం.1 యారి విత్‌ రానా’ షో నిన్ననే ప్రారంభం అయ్యింది. మొదటి ఎపిసోడ్‌లో రాజమౌళిని రానా తీసుకు వచ్చాడు. రాజమౌళితో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మొదటి నుండి కూడా ఈ షోపై చాలా అంచనాలున్నాయి. అయితే అంచనాలను ఈ షో ఏమాత్రం అందుకోలేక పోయిందని చెప్పక తప్పదు. రానా టాక్‌ షో అనగానే ఆసక్తి పెరిగింది. కాని కొత్తగా ఏమీ లేక పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రానా టాక్‌ షో గతంలో వచ్చిన పలు టాక్‌ షోలను పోలి ఉంది. ఇక రానా టాక్‌ షో జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’కు కాపీ మాదిరిగా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. ప్రదీప్‌ షోనే ఇంకా రానా షో కంటే బాగుందని అంటున్నారు. సెలబ్రెటీలతో ప్రదీప్‌ చేసే సందడి అందరిని ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు అంటున్నారు. రానా షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదని విమర్శలు వస్తున్నాయి.

రాజమౌళి మరియు శోభు యార్లగడ్డతో ఎంటర్‌టైన్‌ చేయాలని రానా భావించినా కూడా అది సాధ్యం కాలేదు. యూత్‌ స్టార్స్‌ వల్లే ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధ్యం. రానా అలా కాకుండా జక్కన్న వంటి వారితో ఎంటర్‌టైన్‌ ఎలా చేయగలడు. రాబోతున్న ఎపిసోడ్స్‌లో అయినా రానా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతాడేమో చూడాలి.

To Top

Send this to a friend