డ్రగ్స్ కేసులో పత్రికాధిపతి.. ఎవరాయన?

డ్రగ్స్ కేసులో తవ్వినకొద్దీ కొండలు కదులుతున్నాయి. సినీరంగంలో ప్రముఖులను విచారిస్తుండగా.. వారి అన్యాపదేశంగా మరికొందరి పేర్లు బయటకొచ్చాయి. పూరితో సన్నిహితంగా మెలిగే శ్యాంకే నాయుడును ప్రశ్నించినప్పుడు ఆయన పోలీసుల తీరును ఎండగట్టినట్టు సమాచారం.. సినీ జనాలే కాదు.. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో పత్రికాధిపతి, పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారని వారి పేర్లు బయటపెట్టినట్టు సమాచారం.

డ్రగ్స్ కోసం గోవాకు ఒక్క సినీ జనాలే వెళ్లడం లేదని.. వారే డ్రగ్స్ తీసుకోవడం లేదని.. ఒక పత్రికాధిపతి, పారిశ్రామిక వేత్తలు కూడా గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నారని.. వారిని ఎందుకు విచారించడం లేదని పోలీసులనే శ్యాం కే నాయుడు ప్రశ్నించినట్టు తెలిసింది. దాంతో పోలీసులు ఆ పత్రికాధిపతికి డ్రగ్స్ ఉన్న సంబంధంపై సాక్ష్యాలను ఆరాతీసే పనిలో పడ్డట్టు సమాచారం. ప్రాథమిక సాక్ష్యాలు దొరికితే పత్రికాధిపతికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని వారు తెలిపారు.

అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు మేరకు పలువురు విలేకరులకు కూడా పోలసులు నోటీసులు పంపించారు. డ్రగ్స్ స్మగ్లర్ పీయూష్ చెప్పిన వివరాల మేరకు 15 మంది విలేకరులకు నోటీసులు పంపారు. వారు 24 నుంచి తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించారు.

ఇక ఇంతకీ ఆ పత్రికాధిపతి ఎవరనే విషయంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలుగులో ఉన్న పత్రికల్లో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సాక్షి జగన్ మోహన్ రెడ్డి, నమస్తే దేవందర్ రెడ్డిలు ఈ కేసులో ఇరుక్కునే అవకాశాలైతే లేదు. వారంతా సీనియర్లు, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండేవారు..ఇక వేరే చిన్న పత్రికల అధిపతులే ఈ కేసులో ఇరుక్కున్నారని తెలుస్తోంది.

To Top

Send this to a friend