పవన్‌ నుండి కబురొచ్చింది


పవన్‌ కళ్యాణ్‌ ‘కాటమరాయుడు’ చిత్రంతో ప్రేక్షకులను నిరాశ పర్చాడు. ఆ సినిమాపై పెట్టుకున్న ఆశలు అన్ని కూడా వమ్ము అయ్యాయి. అయినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ తర్వాత సినిమా కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని మళ్లీ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తనకు ఆప్తుడు అయిన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబోలో వస్తున్న సినిమా ఇదే.

భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులు కూడా కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్‌ స్థాయికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని, త్రివిక్రమ్‌ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు, దాంతో ఈ సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్‌ కాస్త ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా విడుదల సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి పవన్‌ సినిమా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అక్టోబర్‌లోనే పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే టైటిల్‌ను అనౌన్స్‌ చేయడంతో పాటు, ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్‌ చేయబోతున్నారు. సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో దాదాపు 150 కోట్ల ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్‌కు జోడీగా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend