పైకి కాదు..కిందికి చూడండి..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా…  ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను రోడ్డుపై ఏర్పాటు చేశారు.  దీంతో సిగ్నల్ జంపింగ్‌లకు అడ్డుకట్టపడడంతో పాటు ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చంటున్నారు పోలీసులు. అంతే కాదు ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందంటున్నారు. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సెంటర్ లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.  జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వీటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గనున్నాయి.  కలర్ ఫుల్ గా కన్పిస్తున్న సిగ్నల్ లైట్లు వాహనదారులకు ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే నగరమంతా ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. ఈ సిగ్నళ్ల ఏర్పాటుతో వాహనదారులు రెడ్‌లైట్ దాటి ముందుకెళ్లే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే, వీటి ఏర్పాటుతో జీబ్రా క్రాసింగ్‌‌‌లకు కొంత విముక్తి లభించనుంది. పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగా వాటిని ఉపయోగించుకుని రోడ్డు దాటవచ్చు.

To Top

Send this to a friend