మళ్లీ ప్రభాస్‌ పెళ్లి వార్తలు

గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రభాస్‌ పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘బాహుబలి’ పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడు అని అంతా భావించారు. అయితే ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు విడదలై నెలలు గడుస్తున్నా ఇంకా కూడా ప్రభాస్‌ పెళ్లి విషయమై ఎలాంటి ప్రకటన రావడం లేదు. ప్రస్తుతం ‘సాహో’ చిత్రం షూటింగ్‌తో ప్రభాస్‌ మళ్లీ బిజీగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ పెళ్లి గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో మొదలైంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ ఇటీవల ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చూపులు చూశాడని, వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటాడు అనేది ఆ ప్రచారం సారాంశం. ప్రభాస్‌ వివాహం ఈ సంవత్సరంలోనే ఉంటుందని అంతా భావించారు. అయితే ఈ సంవత్సరంలో ప్రభాస్‌ పెళ్లి కుదుర్చుకుని ఆ తర్వాత పెళ్లిని పెట్టుకునే అవకాశం ఉంది.

2018లో ప్రభాస్‌ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని ఆ మద్య నిర్మాత వంశీ అన్నాడు. ప్రభాస్‌కు వరుసకు సోదరుడు అయ్యే వంశీ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వంశీ మాటల ప్రకారం వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో పెళ్లి ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకే అమ్మాయిని ఫైనల్‌ చేసి ఉండాలి. లేదంటే ఒకటి రెండు నెలల్లో అమ్మాయిని ఫైనల్‌ చేసే అవకాశం ఉంది.

To Top

Send this to a friend