నీతికి, నిజాయితీకి నిలువెత్తురూపం ఈ పెద్ద పొలీస్


పోలీస్ నౌకరి అంటే ఒట్టిమాటలా.? పోలీస్ అల్లుడి కోసం ఎంత మంది పిల్లనిచ్చే మామలు లక్షలు కట్నం గా పట్టుకొని వెతుకుతున్నారో తెలుసా.? కొన్ని చోట్ల కోటికి పైగా కట్నం ఇచ్చేస్తున్నారు. అంత రాబడి ఉంటుంది కాబట్టే పోలీసోల్లకు మార్కెట్ లో అంత డిమాండ్ ఏర్పడింది.

పోలీసులకు డబ్బు అదే వచ్చిపడుతుంది. మైనింగ్, ఇసుక, మద్యం సిండికేట్, ఎక్సైజ్ తో నెలవారి మామూళ్లు.. నక్సల్ డంపులు.. ఇలా ఒక్కటేమిటీ.. చేయి చాపే గుణముండాలి కానీ లెక్కలేనన్ని డబ్బులు వచ్చిపడతాయి.. కానీ నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఓ యూపీ ఐపీఎస్ కథ అందరిలోనూ స్పూర్తిని రగిలిస్తోంది…

యూపీకి కొత్త డిజీపీగా సుల్ఖాన్ సింగ్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియమించారు. ఆయన 37ఏళ్ల సర్వీసులో అంతా నీతి నిజాయితీ అంటూ లంచం ముట్టుకోలేదట.. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. ఆయనకు ఉన్నదంతా 3 గదుల ఇళ్లు, ఓ రెండెకరాల పొలం.. అంతే.. సాదాసీదా జీవితం.. అతని జీతమే కుటుంబానికి ఆధారం.. పోలీస్ గా మాత్రం చండసాసనుడుట.. అందుకే అఖిలేష్, ఆయన నాన్న ములాయం హయాంలో ఇయన్ను ఎందుకు పనికిరాని శాఖల్లో వేసేశారు.. ఇప్పుడు వచ్చింది బీజేపీ ప్రభుత్వం కావడంతో యోగి ఆదిత్య ఈయన నిజాయితీకి మెచ్చి డీజీపీ పదవి కట్టబెట్టారట.. ఇలా నీతి నిజాయితీలు నమ్ముకున్న 1980 క్యాడర్ ఐపీఎస్ బ్యాచ్ అధికారి సుల్ఖాన్ సింగ్ ను డీజీపీగా ఎంపిక చేయడమే ఓ పెద్ద మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాత్ ను దేశమంతా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

To Top

Send this to a friend