రాజకీయాలను కెలికాడు..

పొలిటికల్ నేపథ్యంలో తీసిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ సినిమాలో రానా నటన మాత్రం ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఫర్ ఫెక్ట్ గా తెరపై కనిపించాడు ఎలాంటి పాత్రనైనా సరే రానా చేస్తే ఇక అది ఎలా ఉంటుంది అన్నది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. సినిమా డైరక్టర్ తేజ ఫస్ట్ హాఫ్ ముఖ్యంగా మొదటి 45 నిమిషాలు రేసీగా నడిపించాడు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వస్తుందో ప్రేక్షకుల సహనానికి కాస్త పరీక్ష పెట్టాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

* కథ
తనకంటూ ఓ మంచి ఫ్యామిలీతో సంతోషంగా జీవితం గడుపుతున్న జోగేంద్ర అనుకోకుండా సర్పంచ్ తో జరిగిన గొడవ వల్ల తాను రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకుంటాడు.. అక్కడి నుండి తన ఎత్తుగడలు మొదలవుతాయి. మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలా ఏకంగా ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించేస్తాడు. అయితే ఈ క్రమంలో తనకు శత్రువులు పెరిగిపోతారు. జోగేంద్ర భార్య రాధా (కాజల్)ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్న జోగేంద్రకు ఒకానిక దశలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అసలు జోగేంద్ర ఎందుకు అలా మారుతాడు..? ఉరి తీసేంత తప్పు జోగేంద్ర ఏం చేశాడు..? ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.

* ఎవరు ఎలా నటించారు..
జోగేంద్రగా రానా మరోసారి అదరగొట్టాడు. తన క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు తేజ ఎంత జాగ్రత్తపడ్డాడో దానికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు రానా. తన ఇంతకుముందు ఇమేజ్ మొత్తం జోగేంద్ర ముందు నిలవలేకపోయాయి. ఇక రాధగా కాజల్ ఇంప్రెస్ చేయగా రిపోర్టర్ గా కేథరిన్ పరిధి మేరకు చేసింది. ఇక మిగతా పాత్రలన్ని సందర్భాన్ని బట్టి బాగా నటించి మెప్పించారు.

* సినిమా ఎలాగుందంటే..
దర్శకుడు తేజ సినిమా మొదటి భాగం ఎంతో తెలివిగా నడిపించాడు. ఆడియెన్స్ అందరిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం నిరాశ పరచాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అదుర్స్.. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంటుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం వల్ల రిచ్ గా అనిపిస్తుంది.

* మైనస్, ప్లస్ పాయింట్స్
సినిమాలో డైలాగ్స్ మాత్రం అదరగొట్టారు. ప్రతి సీన్ కు వారు రాసుకున్న డైలాగ్స్ బాగా హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల మీద నేనే రాజు నేనే మంత్రి ఓ మార్క్ గా చూపిస్తుంది. కమర్షియల్ అంశాల కోసం రాసుకున్న కామెడీ ట్రాక్ బాగుంది. అయితే మొదటి భాగం రేసీగా సాగడం వల్ల సెకండ్ హాఫ్ ఆ వేగాన్ని అందుకోకపోగా బోరింగ్ సీన్స్ అన్నట్టుగా సెంటిమెంట్ సీన్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ నిరసంగా సాగినా కనీసం క్లైమాక్స్ అయినా సినిమాను నిలబెడుతుంది అంటే అది కూడా నిరాశ కలిగిస్తుంది.

యూత్ ఆడియెన్స్ కూడా నచ్చే అంశాలతో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. సినిమాకు ఇచ్చిన ప్రమోషన్ బూస్టింగ్ వల్ల సినిమా కచ్చితంగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. రానా నటన కోసమైనా ఈ సినిమా ఒకసారి చూసేయొచ్చు.

To Top

Send this to a friend