బాహుబలిని మించాలి.. అందుకోసం షాకింగ్‌ నిర్ణయం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ‘బాహుబలి 2’ చిత్రం బాలీవుడ్‌ సినిమాలను కూడా దాటేసి కనీవిని ఎరుగని రికార్డులను సాధించింది. 1600 కోట్ల వసూళ్లను సాధించి ఇండియాస్‌ నెం.2 చిత్రంగా నిలిచింది. సౌత్‌ ఇండియాకు చెందిన ఒక సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బాహుబలి’ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ టార్గెట్‌ చేశాడు.

ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం ‘2.0’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రోబో సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి. రజినీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయబోతున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకంగా 15 భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదో సాదారణ సినిమాలా కాకుండా హాలీవుడ్‌ సినిమాల శంకర్‌ రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ మార్కెట్‌కు తగ్గట్లుగా ఈ సినిమాను తక్కువ నిడివితో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే బాహుబలిని మించడం ‘2.0’కు పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తుంది.

To Top

Send this to a friend