శింబు ‘సరసుడు’ నయనతార..!


‘మన్మథ’, ‘వల్లభ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు. తాజాగా శింబు హీరోగా గ్లామర్‌స్‌ బ్యూటీ నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ ఫేమ్‌ టి. రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌ రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌పై టి.రాజేందర్‌ నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరసుడు’. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌.కురళఅరసన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. ఇటీవల విడుదలైన ఆడియో సూపర్‌హిట్‌ అయ్యి సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టి. రాజేందర్‌ ఈ చిత్రానికి పాటలు, మాటలు రాయడం మరో విశేషం. శింబు, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ చిత్రం తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రమిది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను జూన్‌ 23న రిలీజ్‌ చేశారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. ఈ సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు ఎంతో అప్రిషియేట్‌ చేశారు. అన్ని ఏరియాల నుండి బిజినెస్‌పరంగా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. జూలైై నెలలో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత టి.రాజేందర్‌ మాట్లాడుతూ – ”ఐ.టి బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న చిత్రం ఇది. ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి కురళఅరసన్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ అందించాడు. లేటెస్ట్‌ టెక్నాలజీలో సరికొత్త సౌండింగ్‌తో పాటలు, రీరికార్డింగ్‌ యు.ఎస్‌.లో కంపోజ్‌ చేయడం జరిగింది. విజువల్‌గా సాంగ్స్‌ అన్నీ స్క్రీీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా వుంటాయి. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ముగ్గురు హీరోయిన్స్‌ డిిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. మెయిన్‌గా శింబు, నయనతారల మధ్య వచ్చే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రానికే హైలైట్‌. తెలుగులో మా శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు సినిమా ఇది.

మా చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక్క కట్‌ చెప్పకుండా ‘సినిమా చాలా బావుంది.. అని అప్రిషియేట్‌ చేసి క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో చాలా వున్నాయి. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది. జూలై నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో రిలీజ్‌కి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్‌ ఎంఎ, సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ: సతీష్‌, రచనా-సహకారం: బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌, నిర్మాత: టి.రాజేందర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌.

To Top

Send this to a friend