నేను వైఎస్ జగన్ కాదు.. అలాచేయను..

సీఎం కొడుకులైతే అందరూ వైఎస్ జగన్ లా అవినీతి చేస్తారా.. తాను మాత్రం చేయనని స్పష్టం చేశారు మంత్రి , ఏపీ సీఎం కొడుకు నారాలోకేష్. మంత్రిగా వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సీఎంల కొడుకులందరూ అవినీతి చేస్తారనడం తప్పు అని వ్యాక్యానించారు. 2019 లో గెలవడం కోసం ఢిల్లీ నుంచి కన్సల్టెంట్లను వంద మంది తెచ్చుకున్నా టీడీపీయే గెలుస్తుందని.. బీజేపీ, జనసేన తోడుగా తాము పోటీ చేస్తామని లోకేష్ బాబు స్పష్టం చేశారు.

ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ కు బుద్ది చెబుతామని చెప్పారు. జగన్ ప్రధాని మోడీని కలిసినా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏకు మద్దతు ఇచ్చినా కేంద్రం సహకరించినా బీజేపీ-వైసీపీ కలిసి పోయినట్లు కాదన్నారు.. బీజేపీ-టీడీపీ బంధం ఈనాటిది కాదని.. తమదు చాలా ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ ను లోకేష్ దెబ్బతీస్తున్నాడన్న విమర్శలకు జవాబిచ్చాడు. తాను ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ ను అడ్డుకోవడం లేదని ఎవరైనా టీడీపీలోకి వచ్చి పార్టీ కోసం పనిచేస్తే గుర్తుంపు ఉంటుందని లోకేష్ చెప్పడం కొసమెరుపు. మరి ఎన్టీఆర్ ను ఎందుకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటే.. ‘అది ఎన్టీఆర్ ఇష్టం’ అంటూ తప్పించుకున్నాడు లోకేష్ బాబు..

To Top

Send this to a friend