18 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకు ఇది

నాని హీరోగా నివేదా థామస్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు పాటలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచాయి. దాంతో సినిమాను అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. ఇదొక ట్రై యాంగిల్‌ ప్రేమ కథ అనే విషయం చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండే చెబుతూ వస్తున్నారు.

సినిమా రేపు విడుదల కాబోతున్న సందర్బంగా సోషల్‌ మీడియాలో ఈ చిత్రం కాపీ అంటూ విమర్శలు ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్‌లో 18 ఏళ్ల క్రితం వచ్చిన హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ చిత్రానికి ఇది అనధికారిక కాపీ అంటున్నారు. సినిమాకు సబంధించిన ట్రైలర్‌ చూస్తుంటే అచ్చు ఆ సినిమాను దించేశాడనిపిస్తుంది. అయితే సినీ వర్గాల వారు మాత్రం స్టోరీ లైన్‌ను తీసుకుని ఉంటే ఉండవచ్చు. కాని మొత్తం కాపీ కాదు అంటున్నారు.

నాని, నివేద థామస్‌ జంటగా తెరకెక్కిన విడుదలైన ‘జెంటిల్‌మన్‌’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరి కాంబోలో విడుదలవుతున్న రెండవ సినిమా ఇది కావడంతో ఆసక్తి భారీగా ఉంది. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ఆది నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి ఉంది. రేపు సినిమా విడుదలైన తర్వాత అసలు విషయం వెళ్లడయ్యే అవకాశం ఉంది.

To Top

Send this to a friend