జగన్ బరిలోకి.. బాబులో కలవరం..

దాదాపు 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గ్రామం, వార్డు లెక్కన నంద్యాల నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇంకా వందల మంది టీడీపీ కార్యకర్తలు నంద్యాలలో గెలుపు కోసం శ్రమిస్తున్నారు. అంతా తిరగడం.. సాయంత్రానికి టీడీపీ ఆఫీసులో సంతకాలు పెట్టడం ప్రచారాన్ని మమ అని పించడం చేస్తున్నారట.. దీనిపై చంద్రబాబుకు నివేదికలు అందుతున్నాట.. టీడీపీ నేతల మామూలు ప్రచారం జనంలోకి చేరడం లేదని బాబు కు రిపోర్టులు వస్తున్నాయట..

టీడీపీ తరఫున నంద్యాల బరిలో నిలిచిన బ్రహ్మానందారెడ్డి ఎన్నికలకు కొత్త కావడంతో ఆ గెలుపు బాధ్యతను చంద్రబాబు మొత్తం భూమా అఖిల ప్రియ నెత్తిన పెట్టాడట.. దీంతో ఆమె అన్నయ్య బ్రహ్మానందరెడ్డి వెంట ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు..ఆమెకూడా ఎన్నికల బరిలో అనుభవరాహిత్యం ఉండడంతో టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయట..

అయితే టీడీపీలో, చంద్రబాబులో కలవరం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ ఈనెల 9వ తేదీ నుంచి 21 వరకు నంద్యాల నియోజకవర్గంలోనే మకాం వేసి వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపు ఊరు ఊరు తిరిగేందుకు ప్లాన్ రెడీ చేశాడు. జగన్ స్వయంగా బరిలోకి దిగుతుండడంతో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న టెన్షన్ బాబులో మొదలైందట..

2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవకపోతే వైసీపీలోకి టీడీపీ వలసలు పెరుగుతాయని.. నాయకుల్లో గెలుస్తామన్న ధీమా సడులుతుందని చంద్రబాబు, నాయకులు ఆందోళన పడుతున్నారు. అందుకే నంద్యాల లో ఎలాగైనా గెలిచేందుకు డబ్బు, పరపతి, అధికారం, అభివృద్ది అన్ని ప్రయోగిస్తున్నారు బాబు.. మరోవైపు నంద్యాలలో గెలిస్తే వచ్చే 2019 ఎన్నికల్లో గెలవడం ఈజీగా మారుతుందని .. నాయకుల్లో , ప్రజల్లో వైసీపీపై నమ్మకం పెరుగుతుందని జగన్ భావిస్తున్నాడట..

To Top

Send this to a friend