నంద్యాల ఉప ఎన్నిక రద్దు యోచనలో బాబు..

చంద్రబాబు డైలామాలో పడ్డారా..? 2019 ఎన్నికలకు ప్రీ ఫైనల్ లాంటి నంద్యాలలో వైసీపీ గెలుపు పవనాలు వీస్తున్నాయా.? జగన్ నంద్యాల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ, అధికార టీడీపీకి రావడం లేదట.. దీంతో నంద్యాలలో గెలుపుపై చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది.

నంద్యాలలో హీరో కం టీడీపీ ఎమ్మెల్యే బాలక్రిష్ణతో ప్రచారం బెడిసికొట్టింది. బాలయ్య ఆగ్రహంతో ఓ టీడీపీ కార్యకర్తను కొట్టడంతో తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఆగ్రహం కట్టలు తెంచుకొని టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే భయం బాబులో వచ్చిందట.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండడంతో నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేసే యోచనలో బాబు ఉన్నట్టు తెలిసింది. ఈ నెపం వైసీపీ నాయకుల మీద మోపి.. శాంతి భద్రతల సమస్య పేరుతో ఎన్నికను వాయిదా వేయించాలని బాబు యోచిస్తున్నట్టు సమాచారం.

మరో వైపు నంద్యాలలో అన్నీ తానై జగన్ వీర ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ రీతిలో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రచారం చేయకపోవడం.. బాలక్రిష్ణ ఉన్న ఇమేజ్ ను నిన్న కార్యకర్తను కొట్టి డ్యామేజ్ చేయడంతో ఇప్పుడు చంద్రబాబుకు దిక్కుతోచడం లేదట.. అందుకే నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend