నాగార్జున.. ఓ మంత్రగాడు..

అక్కినేని నాగార్జున .. ఎప్పుడు విలక్షణమైన కథలనే ఎంచుకుంటాడు. అంతేకాదు కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటాడు. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తుంటాడు.. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా సినిమా ‘రాజుగారి గది2’ సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఇందులో ఓ పెద్ద సముద్రం ఉప్పొంగి వస్తుండగా నాగార్జున చేతిలో రుద్రాక్ష పట్టుకొని నియంత్రిస్తున్నట్టు ఫస్ట్ లుక్ కనిపించింది. చేతిలో రుద్రాక్షతో మంత్రగాడిగా నాగార్జున ఈ చిత్రంలో కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్ స్పష్టమైంది.

థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం పూర్తి టీజర్ సెప్టెంబర్ 20 న రిలీజ్ చేయనున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది. 2005లో విడుదలైన రాజుగారి గది1 ఘనవిజయం సొంతం చేసుకుంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ మూవీలో వర్ధమాన నటీనటులు నటించి మెప్పించారు. బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి తీసిన ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

మొదటి సినిమాకు సీక్వెల్ గా తీసిన రాజుగారి గది2 మాత్రం భారీ బడ్డెట్ తో రూపొందింది. పీవీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.. అగ్రహీరో నాగార్జున లీడ్ రోల్ పోషించారు. అంతేకాదు సమంత కీలక పాత్రలో నటించగా.. సీరత్ కపూర్, అశ్విన్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు.

To Top

Send this to a friend