బాబుకు అసమ్మతి: దళిత వాణి గళమెత్తింది..

అంబేద్కర్ జయంతి సాక్షిగా చంద్రబాబుకు అసమ్మతి సెగ తాకింది. చిత్తూరులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ ఎంపీ శివప్రసాద్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై అదే వేదికపై ఉన్న మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఎంపీకి కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది.

ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలు ఏపీ రాష్ట్రంలో నూటికి ఇరవై మంది ఉంటే మాకు ఐదు మంత్రి పదవులు జనాభా ప్రాతిపదికన రావాలి. చంద్రబాబు రెండే ఇచ్చి వదిలేశారు. ఐదుగురికి ఇస్తే వారి ద్వారా ఎంతో మంది లబ్దిపొందవచ్చు కదా.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు జిల్లా నుంచి రూ.350 కోట్లు ఎస్సీలకు ఉపయోగపడకుండా వెనక్కు పంపారు. ఇంత అవమానకర పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనిపై ఎస్సీలు నన్ను నిలదీస్తున్నారు. దీనికి నేనేం సమాధానం చెప్పాలి. రాయలసీమలో ఎస్సీలకు అయితే ఒక్క పదవీ దక్కలేదు’ అంటూ ఎంపీ శివప్రసాద్ ఏకంగా సొంత టీడీపీ ప్రభుత్వంపైనే విరుచుకపడడం కలకలం రేపింది.

దీనికి వేదికపైనే ఉన్న మంత్రి అమరనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.. ‘మంత్రి పదవులు ఇవ్వడం అనేది రాజ్యాంగపరంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేసే కార్యక్రమం. దళితులకు మంత్రి పదవి వచ్చినా.. నాకు మంత్రి పదవి వచ్చినా దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తా.. వేదికపై రాజకీయాలు వద్దు.. ’ అని అన్నారు. దీంతో టీడీపీలో దుమారం రేగింది..

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వర్గాలతో పాటు సొంత పార్టీ నేతలే విమర్శలు మొదలయ్యాయి. ఎంపీ శివప్రసాద్ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ అసంతృప్తి జ్వాల చంద్రబాబుకు ముందుముందు మరిన్ని చిక్కులు తెచ్చే పరిస్థితి ఎదురుకావచ్చు.. సో చంద్రబాబు మేలుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

To Top

Send this to a friend