మూమైత్ సీక్రెట్ గేమ్.. అర్చన ఔట్

 
 
 
బిగ్ బాస్ రూల్స్ అన్ని పక్కన పెట్టేసి ముమైత్ ఖాన్ ను షో నుంచి పంపకుండా   సీక్రెట్ రూంలో బిగ్ బాస్ ఉంచేశాడు.. ఆమె లేదనుకొని సెలబ్రెటీలు ముమైత్ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. ముమైత్ పంపించిన టీషర్ట్ లను చించేశారు.
 
ఇక సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ఈసారి కూడా  అర్చనను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేందుకు అందరూ నామినేట్ చేయడం సంచలనమైంది. గడిచిన వారం కూడా అత్యధికంగా అర్చననే నామినేట్ చేశారు..ఇక రెండో స్థానంలో శివబాలాజీని నామినేట్ చేశారు. ఆ తర్వాత కత్తి కార్తీక, ధన్ రాజ్ లు నామినేట్ అయ్యారు. ఇలా తనను అందరూ టార్గెట్ చేసి నామినేట్ చేయడంపై అర్చన భోరుమంది. తాను అందరితో బాగా ఉంటున్నా.. వంట, ఇంటి పనులు చేస్తున్నా నామినేట్ చేస్తున్నారని వాపోయింది. నవదీప్, ప్రిన్స్ హరితేజలతో గొడవకు దిగింది. ఇలా సోమవారం బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ ప్రక్రియ వివాదాలకు దారితీసింది.
 
ఈ వారం ఎలిమినేషన్ కు అర్చన, శివబాలాజీ, ధన్ రాజ్, కత్తికార్తీకలు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చేవారం హౌస్ నుంచి బయటకు వెళతారు..  ఈ ఆదివారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ ను ఇంటికి పంపకుండా  ఓ సీక్రెట్ రూంలో ఉంచి ఆమెతో కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇప్పిస్తూ అందరి నిజస్వరూపాలను ముమైత్ ఖాన్ కు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు బిగ్ బాస్. సెలబ్రెటీలు ముమైత్ ఖాన్ గురించి చెబుతున్న మాటలు విని ముమైత్ ఆగ్రహంతో, ఆవేదనతో ఊగిపోతోంది. ఇన్నాళ్లు అన్న అని అప్యాయంగా పిలిచిన ధన్ రాజ్ కూడా ముమైత్ లేకపోవడంతో ఆమెపై నోరుజారుతాడు. దీంతో ధన్ రాజ్ తనకు అన్న కాదని.. అసలు బిగ్ బాస్ లో ఎలాంటి సెంటిమెంట్లు, అనుబంధాలు, బంధాలు లేవని.. కేవలం గేమ్ కోసం ఆడతానని ముమైత్ శపథం చేస్తుంది.
 
రాబోయే రోజుల్లో తాను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాక ఒక్కొక్కరి సంగతి తేల్చుతానని.. నా గురించి అంత దారుణంగా మాట్లాడుతారా అని ముమైత్ మండిపడింది.. ఇలా సీక్రెట్ రూంలో ముమైత్ ను పెట్టి ఆమెను రెచ్చగొడుతున్నాడు బిగ్ బాస్.

To Top

Send this to a friend