మోడీని చంపేయడానికి ఐసిస్ పెద్ద స్కెచ్


చైన్నై నుంచి జమ్ము వెళుతున్న అండమాన్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించాలని ఐసిస్ ఉగ్రవాదులు బాంబులు, బండరాళ్లు అడ్డుగా పెట్టారు. వాటిని డ్రైవర్ గుర్తించి రైలును ఆపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ బండరాళ్ల కింద ఓ లెటర్ రాసి ఉంది. ఆ ఐసిస్ ఉగ్రవాదులు పెట్టింది. తొందరలోనే మోడీని చంపేస్తామని అందులో ఉంది. అంతేకాదు.. ఆ లెటర్ లో పార్లమెంటును, హోంమంత్రి రాజ్ నాత్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయబోతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ లేఖలో తానను తాను ఐఎస్ఐ కమాండెంట్ గా పేర్కొంటూ తాను ఇండియా ఐసిస్ నాయకుడని.. తన పేరు మహమ్మద్ మీర్జా అని లేఖలో పేర్కొన్నాడు. ఇతడే గత ఏడాది కంటోన్మెంట్ స్టేషన్ లో ఇదే విధంగా బెదిరింపు లేఖను వదిలిపెట్టాడు. ఈ బెదిరింపు లేఖలను పరిశీలించిన భద్రత సిబ్బంది మరింత అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోడీతో పాటు ప్రముఖుల భద్రతను సమీక్షించి మరింత కట్టుదిట్టం చేయాలని భద్రతాదళాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

To Top

Send this to a friend