మోడీని, చంద్రబాబును డైరెక్ట్ గా తిట్టయ్యా..


పాపం.. ఆయన చేసిన నేరం ఏమీ లేదు.. టీటీడీ ఈవోగా నియమితుడవడం ఆయన చేసిన తప్పు కాదు.. పైగా ఈవోగా నియామకం కాగానే కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవడం తప్పే కాదు.. కేవలం ఉత్తరాది వాడు అన్న కారణంతో ఆయనను.. ఓ ఐఏఎస్ ను విమర్శించడం ఎంత వరకు సమంజసం.. ఆయన్ను టీటీడీకి ఈవోగా నియమించవద్దనడం ఎంత వరకు కరెక్ట్.. ఉత్తరాది ఐఏఎస్ అయితే దేవుడిపై భక్తి ఉండదా..? దేవుడు ఉత్తరాది వారిని, దక్షిణాది వారిని సపరేట్ గా చూస్తాడా.? దక్షిణాది వారు పూజలు చేస్తేనే స్వీకరిస్తాడా.. ఇవేవీ కావు.. దేవుడికి అందరూ సమానులే..

మరి ఎందుకు ఈ ప్రాంతీయ బేధాలు.. పోనీ బేధాలు సరే.. ఉన్నాయనుకుందాం.. అందుకోసం చేసేవారిని పట్టుకొని నిలదీయాలి.. కానీ ఒక ఇండియన్ ఐఏఎస్ అధికారి మనోభావాలను అవమానించడం కరెక్ట్ కాదు. వేసిన చోట తన పని తాను సమర్థంగా నిర్వహించే అధికారిని ఆ పోస్టుకు వద్దనడం ఎంతవరకు సమంజసం పవన్ జీ..

జనసేనాని పవన్ కళ్యాణ్ డొంక తిరుగుడు ట్వీట్లు అసలు తాకే వారికి తాకడం లేదు. మధ్యలో బాధ్యతలు నిర్వహించే అధికారిని మాత్రం అభాసుపాలు చేశాయి. ఆ అధికారి ఆయనే సొంతంగా నియామకం కారనే విషయం పవన్ కు తెలియదా అంటే.. తెలుసు.. అధికారిని నియమించిన చంద్రబాబును ఏమీ అనకుండా.. ఉత్తరాది భావజాలాన్ని విస్తరిస్తున్న ప్రధాని మోడీని తిట్టకుండా కేవలం ఉత్తరాది అధికారిని ఆడిపోసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉదయిస్తోంది..

పవన్ కళ్యాన్ తీసుకుంటున్న స్టెప్ లు అధికార టీడీపీ, బీజేపీ అధినేతలు చంద్రబాబు, మోడీలకు ఎఫెక్ట్ కాకుండా ఉంటున్నాయి. ఆయన కేవలం సమస్యకు కారుకులైన వారిని వదిలేసి.. చిన్న చేపలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. టీటీడీ ఈవో నియామకం పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు ఇష్టంతో కూడుకున్నది. ఆ విషయాన్ని పవన్ సూటిగా చంద్రబాబు.. ‘ఏమయ్యా ఎందుకు ఉత్తరాది అధికారిని నియమించావ్ ’ అని ప్రశ్నించొచ్చు.. కానీ దీనికి విరుద్ధంగా ఉత్తరాదిలో నియమించడం లేదు.. దక్షిణాదిలో ఉత్తరాది అధికారులు అవసరమా అని నిందించడం ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

పవన్ రాజకీయాలు సూటిగా చేస్తే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసంబద్ధ నిర్ణయాలపై అటు మోడీని, ఇటు చంద్రబాబును సూటిగా ప్రశ్నించాలని కోరుతున్నారు. అంతేకానీ.. ఉత్తరాది అధికారి మనోభావాల దెబ్బ తీసేలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని విమర్శిస్తున్నారు. డైరెక్ట్ గా ఈ నియామకం చేసిన చంద్రబాబును టార్గెట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాది భావజాలాన్ని రెచ్చగొట్టే మోడీని డైరెక్టుగా ఒక్క మాట అనని పవన్ మరి ఎందుకు ఉత్తర, దక్షిణ ధ్రువాలను పట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నది చిక్కు ప్రశ్న..

To Top

Send this to a friend