పెట్రోల్, మద్యంపై కేంద్రం దొంగాట..

వస్తు సేవల పన్ను జీఎస్టీ నుంచి మద్యాన్ని, పెట్రోల్‌ను ఎందుకు మినహాయించారు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? దీనివల్ల ప్రజలకు లాభమా.. నష్టమా? ఒకవేళ ఈ రెండింటినీ జీఎస్టీ జాబితాలో చేరిస్తే రాష్ట్రాల పరిస్థితేంటి?

భారీ ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ మధ్య పెద్దనోట్లను రద్దు చేసింది. ఆ కష్టాల నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే అంతా ఆదాయపన్ను నిఘాలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వన్ నేషన్.. వన్ ట్యాక్స్ పేరుతో తీసుకువస్తున్న జీఎస్టీ పరిధిలోకి ఏమేమి వస్తాయో.. వేటి వేటికి పన్ను మినహాయింపు ఉంటుందో ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది.

ఈ జాబితాను పరిశీలిస్తే అందులో రెండు అంశాలు కనిపించవు. అవే పెట్రో ఉత్పత్తులు, మద్యం. మరి ఈ రెండింటికీ పన్ను మినహాయింపు ఎందుకిచ్చింది? కీలకమైన ఈ రెండు అంశాలను ప్రభుత్వం వ్యూహాత్మకంగానే పక్కన పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వాస్తవానికి జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు వస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయి. మనదేశంలో పెట్రోల్ బేస్ రేటు కంటే పన్నులే అధికంగా ఉంటాయి. చమురు సంస్థలు పెట్రోల్‌ను లీటరు రూ.19కే కొనుగోలు చేస్తున్నా.. దానికి ప్రాసెసింగ్ ఫీజు, రవాణా వ్యయం, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ కలిపి లీటర్ పెట్రల్‌ను రూ.65-70 మధ్య విక్రయిస్తున్నారు. అదే పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర సగానికి పైగా తగ్గుతుంది. అంటే లీటర్ పెట్రోల్ ధర రూ.25-30 మధ్య విక్రయించాల్సి వస్తుంది. కానీ కేంద్రం ఈ పని చేయదు.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పెట్రో ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరు కావడం దీనికి కారణం. ఈ విషయం సామాన్యులకు తెలియదు. తెలిసిన వారు అడగలేరు. అడిగినా కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు.  ఇలా ఏక పక్షంగా వ్యవహరిస్తున్న పభుత్వాన్ని ప్రజలే గట్టిగా నిలదీయాలి,ఇలాంటి వాటికి సోషల్ మీడియా సత్తా చూపాలి.

To Top

Send this to a friend