బన్నీని వెలివేయనున్న మెగాఫ్యాన్స్‌

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం వివాదాలకు కేంద్ర బింధువు అయ్యింది. సినిమా పస్ట్‌లుక్‌ వచ్చినప్పటి నుండి సినిమా బ్రహ్మణులకు వ్యతిరేకంగా ఉందని, బ్రహ్మణుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. సినిమా విడుదల చేయవద్దని కొందరు బ్రహ్మణులు కోర్టును సైతం ఆశ్రయించారు. ఇంత జరిగినా కూడా ఏదో విధంగా సినిమా విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుండి పర్వాలేదు అంటూ టాక్‌ వచ్చింది. దాంతో మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది అంటూ ప్రకటించారు.

రెండవ వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌ ఖైదీ నెం.150 చిత్రం కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ చిత్రాన్ని మించిన కలెక్షన్స్‌ ‘డీజే’కు వచ్చాయంటూ ప్రచారం చేయడంతో మెగా ప్యాన్స్‌కు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డీజే చిత్రంకు సంబంధించిన ఆఫీస్‌పై మెగా ఫ్యాన్స్‌ దాడికి దిగారు. రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు స్వయంగా ఈ దాడి చేయించాడు అనే టాక్‌ ఉంది. డీజే ఆఫీస్‌తో పాటు దిల్‌రాజు ఆఫీస్‌పై కూడా దాడికి మెగా ఫ్యాన్స్‌ ప్రయత్నించారు. అయితే దిల్‌రాజు ఆఫీస్‌ ముందు ముందు జాగ్రత్తగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.

చిరంజీవినే దాటేయాలని, దాటేశానంటూ విర్రవీగుతున్న అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ నుండి వెలివేయాలంటూ మెగా ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇకపై మెగా ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ సినిమాలకు సపోర్ట్‌గా నిలవరు అంటూ కొందరు ఫ్యాన్స్‌ చెప్పుకొచ్చారు. బన్నీ ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. మెగా ఫ్యాన్స్‌ మద్య ఉన్న విభేదాలు ఈ సంఘటనతో మరింత ఎక్కువ అయ్యాయి.

To Top

Send this to a friend