మెగా మనసు..

శ్రీ కృష్ణదేవరాయలు గ్రామీణ సంస్థకు 30,00,000 రూపాయిల విరాళాన్ని ( ఎంపీ గ్రాండ్స్ ) కేటాయించిన మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి…

అది గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం లోని చక్రాయపాలెం గ్రామం … ఇక్కడ అందరూ మెగాఫ్యామిలీ అభిమానులే … ఇంక చిరంజీవి అన్నయ్య అంటే అక్కడున్న ప్రతీ ఒక్కరికీ ప్రాణం కన్నా ఎక్కువ.
అసలు విషయంలో కి వెళితే చిరంజీవి అన్నయ్య సినీరంగ ప్రవేశం చేసి నలబై వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 400 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత నాయకులు స్వామినాయుడు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే… ఆ క్రమంలోనే లాస్ట్ ఆదివారం చక్రాయపాలెంలో స్థానిక అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా స్వామినాయుడు గారు రావటం జరిగింది … అదే సమయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ చందు నాగేశ్వరరావు గారి ఇంటికి గౌరవార్ధం వెళ్ళటం ఆ సమయంలో తెనాలికి చెందిన కాపు నాయకులు తోటకూర వెంకటరమణ రావు గారు నిర్మాణంలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయల గ్రామీణాభివృద్ధి సంస్థ బిల్డింగ్ విషయాన్ని స్వామినాయుడు గారి దృష్టికి తీసుకువచ్చారు… నిర్మాణం పూర్తి అవ్వాలంటే 50 లక్షలకు పైనే ఖర్చు అవుతుంది అని చెబుతూ చిరంజీవి గారి ఎంపీ గ్రా0డ్స్ నుంచి ఒక 10 లక్షలు ఇప్పించేలా ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశారు…
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్వామినాయుడు గారు పూర్తి సమాచారంతో చిరంజీవి గారిని కలవటం … విషయాన్ని పూర్తిగా విన్న చిరంజీవి గారు సానుకూలంగా స్పందించటం చకచకా జరిగిపోయాయి…
అయితే చక్రాయపాలెం పెద్దలు ఆశించినట్లు 10 లక్షల విరాళాన్ని స్వామినాయుడు గారు 20 లక్షలు ఇచ్చే విధంగా కృషి చేసారు…

ఈ విషయమై ఈ రోజు చిరంజీవి గారిని స్వామినాయుడు గారి ద్వారా చక్రాయపాలెం పెద్దలు, అభిమానులు కలవటం జరిగింది .
అంతా విన్నాక చిరంజీవి గారు స్పందించిన తీరు అద్భుతం … చక్రాయపాలెం పాలెం గురుంచి ఒక అవగాహన ఉన్న చిరంజీవి గారు శ్రీకృష్ణ దేవరాయల గ్రామీణాభివృద్ధి సంస్థకు తన ఎంపీ గ్రాంట్ నుంచి 30,00,000 రూపాయలను ఇస్తున్నట్లు చెప్పటంతో అక్కడున్న వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

To Top

Send this to a friend