చైతూ నోటి వెంట పెళ్లి కబురు

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహ నిశ్చితార్థం అయ్యి ఆరు నెలలు కావస్తుంది. కాని ఇప్పటి వరకు పెళ్లి ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ లేక పోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. మీడియాలో చైతూ వివాహం గురించి పలు రకాలుగా వార్తలు వచ్చాయి. పెళ్లి అక్కడ, పెళ్లి ఇక్కడ, అప్పుడు, ఇప్పుడు అంటూ పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు చైతూ పెళ్లిపై నోరు తెరచి ఒక క్లారిటీ ఇచ్చాడు.

తమ పెళ్లి అక్టోబర్‌ 6న జరుగబోతున్నట్లుగా నాగచైతన్య తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చాడు. సమంతతో మళ్లీ నటించాలనే కోరిక తనకు ఉందని, అందుకోసం ఒక రొమాంటిక్‌ వ్‌ స్టోరీ కావాలని చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమాలను ఇద్దరం కూడా అక్టోబర్‌ వరకు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా చైతూ పేర్కొన్నాడు.

పెళ్లి కోసం లాంగ్‌ గ్యాప్‌ తీసుకోవాలనే ప్లాన్స్‌ ఏమీ లేవని, కంటిన్యూగానే ఇద్దరం సినిమాలు చేస్తామని చైతూ చెప్పుకొచ్చాడు. మరి కొన్ని రోజుల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక సమంత తన జీవితంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని మరోసారి చైతూ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందని క్లారిటీగా చైతూ చెప్పుకొచ్చాడు. ఆమె ఇష్టం ఉన్నంత కాలం సినిమాలు నటించవచ్చని, తానేం అడ్డు చెప్పనంటూ చైతూ పేర్కొన్నాడు. చైతూ నోటి వెంట పెళ్లి మాట రావడంతో ఫ్యాన్స్‌ అంతా ఖుషీ అవుతున్నారు.

To Top

Send this to a friend