మరో రిక్రూట్ మెంట్

జనసేనాని రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల నాటికి అంతా సిద్ధం చేశారు. నాయకులు, యువత, ఔత్సాహిక మేధావులందరూ జనసేనాని నిర్వహించే ఎన్నికల యుద్ధంలో పాలుపంచుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. మొన్నటికి మొన్న అనంతపురంలో నాయకులు, మేధావుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహించిన జనసేన.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర లో నాయకుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహించింది.

జనసేనాని 2019 ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే అనంతపురంలో నాయకులు, వ్యూహకర్తల కోసం జనసేన ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకులు, మేధావులు, అనలిస్ట్ లు, కంటెంట్ రైటర్ లు కావాలంటూ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రక్రియలో యువతను భాగస్వామ్యం చేయాలని భావించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు. ఈసారి తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో నాయకుల రిక్రూట్ మెంట్ ప్రకటన విడుదల చేశారు.

జనసేన వెబ్ సైట్ లో ఔత్సాహికులైన యువత, మేధావులు, కంటెంట్ రైటర్స్, అనలిస్టులు జనసేన తరపున చురుకుగా పాల్గొనే వాళ్లందరూ జనసేన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పవన్ జనసేన వెబ్ సైట్ లో ఏ జిల్లాకు ఆ జిల్లా యూఆర్ఎల్ ను అందుబాటులో ఉంచారు..

యువత దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ చిరునామా..
గ్రేటర్ హైదరాబాద్ : https://janasenaparty.org/greaterhyderabad/
విశాఖపట్నం : https://janasenaparty.org/visakhadistrict/
శ్రీకాకుళం: https://janasenaparty.org/srikakulamdistrict/
విజయనగరం : https://janasenaparty.org/vijayanagaramdistrict/

To Top

Send this to a friend