పవన్‌25 లో ఎన్ని ప్రత్యేకతలో

ప్రస్తుతం పవన్‌ తన 25వ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీగా త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ఏ విషయంలో కూడా రాజీ పడక పోవడం వల్ల ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసే పలు అంశాలు ఉన్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా.. పాట పాడి అలరించిన పవన్‌ కళ్యాణ్‌తో మరోసారి ఈ సినిమాలో పాటను పాడివ్వాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకు పవన్‌ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పాటను రికార్డ్‌ చేసేందుకు సంగీత దర్శకుడు అనిరుథ్‌ సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌పై విభిన్న తరహాలో యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలపై పవన్‌ పెద్దగా ఆసక్తి చూపించడు. కాని ఈసారి మాత్రం త్రివిక్రమ్‌ కోరిక మేరకు చాలా జాగ్రత్తలు తీసుకుని, విభిన్నంగా ఫైట్స్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్యాన్స్‌ల విషయంలో కూడా కొత్త పవన్‌ను చూస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి పవన్‌ ను ఆయన 25వ చిత్రంలో కొత్తగా చూడటం ఖాయంగా కనిపిస్తుంది.

To Top

Send this to a friend