మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో


సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త సంజయ్ స్వరూప్-జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం కానున్నారు.
ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మే 10) హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది.
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ కథానాయికలు.
హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మంజుల కుమార్తె జాహ్నవి క్లాప్ కొట్టగా.. మంజుల సోదరీమణులు పద్మావతి ఘట్టమనేని (మంత్రి జయదేవ్ గల్లా సతీమణి) – ప్రియదర్శిని ఘట్టమనేని (కథానాయకుడు సుధీర్ బాబు సతీమణి) కెమెరా స్విచ్చాన్ చేశారు. మంజుల ఘట్టమనేని గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర ప్రారంభోత్సవంగా సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈనెల 20 నుంచి గోవాలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మంజుల ఈ సినిమా కోసం కథ-కథనం కూడా అందించడం విశేషం. సందీప్ అయితేనే ఈ కథకు యాప్ట్ అవుతాడు. ఒక సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది” అన్నారు.
సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, నాజర్, అదితి ఈశ్వరన్, పునర్నవి భూపాలం, జాన్వి స్వరూప్, ప్రియదర్శి, అభయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: లంక సంతోషి, కొరియోగ్రఫీ: బృంద, సంగీతం: రాధన్, కళ: పురుషోత్తమ్, సినిమాటోగ్రఫీ: రవియాదవ్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, కథ-కథనం-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని!

To Top

Send this to a friend