మంచు మనోజ్‌ చేయబోతున్నదేంటి..!

హీరోలు అంటే సినిమాల్లోనే హీరోయిజం చూపుతారు. అయితే కొందరు మాత్రం నిజంగా కూడా హీరో అనిపించుకుంటారు. సామాన్యుల కోసం ఏదో ఒకటి చేయాలని గత కొంత కాలంగా మంచు మనోజ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మద్య వైజాగ్‌లో తుఫాన్‌ బాధితుల కోసం మంచు మనోజ్‌ అందించిన సాయం ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. తమిళ హీరో విశాల్‌ కూడా పేద వారి కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూనే ఉంటాడు.

విశాల్‌ మాదిరిగానే ఇప్పుడు మంచు హీరో మనోజ్‌ కూడా ఒక మంచి కార్యక్రమంతో రాబోతున్నాడు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందరికి అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య ు చేసుకుంటున్నాడు అనే విషయాన్ని తె ుసుకుని వారికి సాయం చేయా నే పట్టుదలతో ‘సేవ్‌ ది ఫార్మర్‌’ అనే కార్యక్రమంను మొదలు పెట్టబోతున్నాడు. అందుకోసం తను ఒక్కడే కాకుండా సినీ వర్గాల నుండి పలువురిని అందులో భాగస్వామ్యం చేయబోతున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో రైతుల దీన స్థితి చూసి మంచు మనోజ్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే మంచు మనోజ్‌ ‘సేవ్‌ ది ఫార్మర్‌’ కార్యక్రమం ద్వారా ఏం చేస్తాడు, రైతులకు ఎలా ఉపయోగపడతాడు అనే విషయాల్లో మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే మంచు మనోజ్‌ ఆ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఏం చేసినా కూడా రైతుల కోసం మనోజ్‌ చేయబోతున్న పనిని అంతా కూడా అభినందించాల్సిందే.

To Top

Send this to a friend