మహానటి మొదలైంది.. విడుదల ఎప్పుడంటే!

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ‘మహానటి’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రెండు సంవత్సరాల పాటు సావిత్రి జీవితం గురించి అద్యాయనం చేసి ఎట్టకేలకు స్క్రిప్ట్‌ను పూర్తి చేసి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించాడు. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషిస్తుంది.

 

ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. దాంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు బాగా పెరిగాయి. ఇక కీర్తి సురేష్‌తో పాటు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో సమంత నటించనుండటంతో ఈ సినిమా స్థాయి మరింత పెరగబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌ మరియు విజయ్‌ దేవర కొండలు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించనున్నారు. మొత్తానికి ఇదో భారీ సినిమాగా తెరకెక్కబోతుంది.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే సినిమాను రెండు భాషల్లో చిత్రీకరించనున్నారు. పు సీన్స్‌ను తెలుగు మరియు తమిళ ఆడియన్స్‌ కోసం వేరు వేరుగా స్థానిక నటీనటులతో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను విడుద చేసే అవకాశాలున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

To Top

Send this to a friend