మనకు ఫ్రీ ఇచ్చి నష్టపోతున్న జియో..


రిలయన్స్ జియో రావడమే ఒక సంచలనం.. ముఖేష్ అంబానీ.. ప్రధాని నరేంద్రమోడీ కలలకు వాస్తవ రూపం తేవడానికి దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. జియోను రంగ ప్రవేశం చేయించి అప్పటివరకు ఇష్టానుసారంగా డేటా సేవలను అందించిన టెలికాం ఆపరేటర్లకు షాక్ ఇచ్చారు. 6 నెలల పాటు జియో తీసుకున్న వారికి ఉచిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సేవలు అందించి అబ్బురపరిచారు. ఆఫర్ ముగిశాక కూడా 99తో రీచార్జ్ చేసుకున్న వారికి సంవత్సరం పాటు ఉచిత సేవలను కొనసాగించారు. ఇప్పుడు జియో మేనియాకు అందరూ గులాం అవుతున్నారు. ఇంటర్నెట్ సేవలను పేదలకు చెంతకు చేర్చిన జియో మాత్రం మనకు ఫ్రీ ఇచ్చి నష్టపోతోంది.. ఇది నిజం. జియో అంచనాలు అందుకోలేకపోయింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో గడిచిన ఆరు నెలల వ్యవధిలో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధి లో రిలయన్స్ జియో నష్టాలను ప్రకటించింది.

గతేడాది ఇదే కాలంలో కంపెనీ నష్టాలు రూ.7.46 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం కంపెనీ వ్యయాలు, నెట్ వర్క్ విస్తరణ, టవర్ల ఏర్పాటుతో భారీగా వ్యయం పెరిగినట్టు తెలిపింది. గతేడాది కంపెనీ వ్యయాలు 13.63 కోట్లు కాగా ఈ ఏడాది అది 34.88 కోట్లుగా నమోదైంది. దీంతో జియో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.

కాగా ముకేష్ అంబానీ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. తమ 4జీ సర్వీసులను విస్తరించడానికి రూ.2 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. నెట్ వర్క్ విస్తరణ, టవర్ల ఏర్పాట్ల కోసం దీన్ని వినియోగించనున్నారు.

To Top

Send this to a friend