మళ్లీ దెబ్బతీశావా.?


‘జియో ప్రైమె మెంబర్ షిప్ నిన్నటికి ఆఖరు.. దీంతో జియో కస్టమర్లందరూ ఎగబడ్డారు. సర్వర్ మొరాయించింది. దీంతో ఆఫర్ ను ఏప్రిల్ 15వరకు పొడిగించక తప్పలేదు..’అని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటనతో ప్రత్యర్థి టెలికాం కంపెనీలు నిరాశలో కూరుకుపోయాయి. ఇప్పటికైనా జియో ఆఫర్ ముగిస్తే కస్టమర్లు డబ్బులు పెట్టాల్సి వచ్చి తమతోనే ఉంటారని భావించిన ఎయిర్ టెల్, ఐడియా వోడాఫోన్ లు… జియో ఆఫర్ పొడిగించడంతో కుదేలయ్యాయి.

జియోకు ఇప్పటికే 7.2 కోట్ల మంది ప్రైమ్ లోకి మారారు. మొత్తం 12 కోట్ల కస్టమర్లు ఉంటే.. 4.8కోట్ల మంది జియో మెంబర్ షిప్ తీసుకోలేదు. వారందరూ ఇతర నెట్ వర్క్ లతోనే కొనసాగుతారని ఆశించారు. కానీ జియో మెంబర్ షిప్ పొడిగించడంతో అంతా తలకిందులైంది.

కాగా జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. ఏప్రిల్ 15లోపు 303 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే మూడు నెలల ఉచిత సర్వీసులను అందిస్తున్నట్టు తెలిపింది. అంటే ఫ్రీ కాల్స్, ఎస్ ఎంఎస్, డేటాను వినియోగించుకోవచ్చన్న మాట..

To Top

Send this to a friend