అసెంబ్లీకి చేరిన శ్రీమంతుడు..!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఎట్టకేలకు కొరటాల శివ చిత్రం ‘భరత్‌ అను నేను’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. దాదాపు ఆరు నెలలుగా మహేష్‌బాబు కోసం కొరటాల శివ ఎదురు చూస్తున్నాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రం షూటింగ్‌ వాయిదాలు పడుతూ లేదా పెరుగుతూ వస్తు ఇన్నాళ్లు ఆ చిత్రంతోనే మహేష్‌బాబు బిజీగా గడిపాడు.  సినిమా ఒక కొలిక్కి వచ్చింది. మరో షెడ్యూల్‌లో పూర్తి అవుతుంది. ‘స్పైడర్‌’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభంకు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఆ గ్యాప్‌లోనే కొరటాల శివ చిత్రం షూటింగ్‌లో మహేష్‌బాబు పాల్గొంటున్నాడు. దాదాపు నెల రోజుల క్రితమే కొరటాల శివ షూటింగ్‌ను ప్రారంభించాడు. మహేష్‌బాబు లేకుండానే కొన్ని సీన్స్‌ను చిత్రీకరించాడు. ఎట్టకేలకు మహేష్‌బాబు జాయిన్‌ అవ్వడంతో చిత్రీకరణ మరింత జోరుగా సాగుతుంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ఒక అసెంబ్లీ సెట్టింగ్‌లో మహేష్‌బాబు మరియు లీడ్‌ ఫేర్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నాయి. ఆ తర్వాత హీరోయిన్‌తో సీన్స్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ స్పైడర్‌కు మహేష్‌ బాబు షిప్ట్‌ అవుతాడు. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఇక పూర్తిగా కొరటాల కోసం డేట్లు కేటాయిస్తాడు. ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. త్వరలోనే కొరటాల శివ ఆ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

To Top

Send this to a friend